ధర్మపురి పట్టణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం.1 తేదీ.29.12.2021

ధర్మపురి పట్టణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్


జగిత్యాల, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ది పరిచే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాంక్ష మేరకు, దేశంలో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలలో ఒకటిగా నిలిచిన శ్రీ లక్ష్మీనారసింహ స్వామి దేవాలయం, ధర్మపురి పట్టణంలో, అంచలంచలుగా అభివృద్ది పనులను చేపడుతూ శిఖరాగ్రాన నిలిపేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు.

ధర్మపురి పట్టణ అభివృద్ది కొరకు 100 కోట్ల నిధుల బజ్జెట్ మంజూరు కాగా, మొదటి విడతలో 32 వసతి గధులు గల శ్రీలక్ష్మీనర్సింహ సదన్ ధర్మశాల పైన ఎస్.డి.ఎఫ్ నిధులు 5 కోట్లతో మొదటి, రెడవ అతస్థులను 60 గదులతో నిర్మించడానికి మరియు పట్టణంలోని బస్టాండ్ పక్కన 1 కోటి 50 లక్షల నిధులతో కే.ఎస్.ఆర్. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన కార్యక్రమాలతో పాటు ఇతర అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావా వసంత, జిల్లా కలెక్టర్ జి.రవి, మున్సిపల్ ఛైర్పెర్సన్ సంగి సత్తెమ్మ, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఏ.శ్రీకాంత్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు,ఈ.ఓ., అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం జగిత్యాల చే జారీ చేయనైనది.

ధర్మపురి పట్టణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

Share This Post