ధర్మసాగర్ మండలం లోని ధర్మసాగర్, ముప్పారం, నారయణగిరి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ధర్మసాగర్ మండలం లోని ధర్మసాగర్, ముప్పారం, నారయణగిరి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలు పడుతున్నందున కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోకుండా ఎప్పటికప్పుడే మిల్లులకు తరలించాని అధికారులకు సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా లారీలు పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, టార్పాలిన్లు, గున్ని బ్యాగులు తగినన్ని ఉన్నాయా లేవా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని, ధాన్యం కొనుగోలు సజావుగానే కొనసాగుతున్నట్లు కొనుగోలు కేంద్ర సిబ్బంది కలెక్టర్​కు వివరించారు.
ప్రభుత్వం  అందిసున్న మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
వారి శ్రమ దళారులపాలవకుండా ప్రభుత్వం కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చూడాలన్నారు.
తేమశాతాన్ని కొలిచే కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలుసూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలక్టర్ సంధ్యారాణి, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్,డియస్ ఓ వసంత లక్ష్మీ, డి. ఎం. సివిల్ సప్లయ్ కృష్ణ వేణీ, డీసీఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post