ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్


కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలు దేశానికే ఆదర్శం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
దేశంలో ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసిఆర్
అనవసరపు సీజేరియన్ అరికట్టేందుకు కేసిఆర్ కిట్
పల్లెప్రగతి ద్వారా గ్రామాలో అన్నీ సౌకర్యాల కల్పన
రైతు సంక్షేమం దిశగా 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ
ధర్మారం మండలంలోని పలు గ్రామాలో పర్యటించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి , ఆగస్టు 18
:-. కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎంపిడిఒ కార్యాలయంలో మంత్రి బుధవారం 114 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టిందని, నిరు పేద ఆడపడుచుల వివాహలకు మేనమామలాగా అండగా ఉంటున్నారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను సీఎం కేసిఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజల కష్టాలు తెలుసుకొని మానవీయ కోణంలో పనిచేసే ముఖ్యమంత్రి ఉండటం వల్ల మాత్రమే ఈ సంక్షేమ పథకాలు మనకు అందుతున్నాయని మంత్రి పేర్కోన్నారు మహిళల ప్రసవ సమయంలో అనవసరపు సీజేరియన్ ఆపరేషన్లు చేసి ఆర్థికంగా దోపిడికి ప్రైవైట్ ఆసుపత్రులు గురిచేయడం నివారించడం కోసం సీఎం కేసిఆర్ అమ్మ ఒడి, కేసిఆర్ కిట్ అనే పథకం ప్రారంభించారని మంత్రి అన్నారు. కేసిఆర్ కిట్ పథకం ప్రవేశ పెట్టిన తరువాత అధిక ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులో జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గ్రామాలో మౌలిక వసతుల కల్పన దిశగా పకడ్భంది చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ప్రతి మాసం గ్రామాలకు సీఎం కేసిఆర్ నిధులను విడుదల చేస్తున్నారని మంత్రి తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో పారిశుద్ద్యం, పచ్చదనం పెంపొదిస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసామని, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, స్మశానవాటిక , కాంపోస్ట్ షెడ్ నిర్మించుకున్నామని, సీఎం కేసిఆర్ పాలనదక్షత వల్ల మాత్రమే ఇది సాధ్యమయిందని మంత్రి తెలిపారు రైతు సంక్షేమానికి దేశంలో ఎవరు ప్రవేశ పెట్టని పథకాలను సీఎం కేసిఆర్ ప్రవేశపెట్టారని, రైతు బంధు పథకం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి తెలిపారు. కరోనా కష్ట సమయంలో సైతం రైతు బంధు, రైతు బీమా పథకాలను సీఎం కేసిఆర్ అమలు చేస్తున్నారని, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల రైతులకు రైతు బీమా అందించేందుకు రూ.1450 కోట్లకు పైగా ఖర్చు చేసారని, వానాకాలంలో 60 లక్షల పైగా రైతులకు 7600 కోట్లకు పైగా నిధులను పెట్టుబడి కింద సీఎం కేసిఆర్ అందించారని అన్నారు. మన భారత దేశంలో బీజేపి 18 రాష్ట్రాలో, కాంగ్రెస్ పలు రాష్ట్రాలో పరిపాలను సాగిస్తుందని, కాని మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని మంత్రి తెలిపారు
అనంతరం ధర్మారం మండలం కేంద్రంలో ఎంపడిఒ కార్యాలయంలో ఎస్సి కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు శిక్షణ, మరియు జ్యూట్ వస్తువుల తయారీ పై శిక్షణ కొరకు ఎంపికైన అభ్యర్థుల కు అవగాహన కార్యక్రమం లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు పాల్గొన్ని వారికి పలు సూచనలు చేసారు.
అనంతరం ధర్మారం మండలం మేడారంలోని అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టినందుకు గాను మంత్రి గారిని సన్మనించారు. అనంతరం ధర్మారం మండలంలోని సాయంపేట గ్రామంలో రూ.12 లక్షల 60 వేల వ్యయంతో నిర్మించిన వైకుంఠదామం, బస్ షెల్టర్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఖీలవనపర్తి గ్రామంలో ఎరువుల గోదాం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసారు. అనంతరం మంత్రి నర్సింహుపల్లి గ్రామంలో పర్యటించి బస్ షెల్టర్ ప్రారంభించారు. నర్సింహపల్లి గ్రామంలో యాదవ, గౌడ భవన నిర్మాణ పనులకు, మున్నూరు కాపు సంఘ భవన మిగులు పనులకు శంకుస్థాపన చేసారు. నర్సింహపల్లి గ్రామంలో రూ. 5 లక్షల తో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించి, జులై నెల లో కరెంటు షాక్ తో 6 గేదెలు మరణించిగా ఒక్కొక్క గేదెకు 40 వేల చొప్పున 6 గేదెల కు రూ. 2,40,000 రూపాయల పరిహారం చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందించారు

   ఈ కార్యక్రమంలో MPP ముత్యాల కరుణ శ్రీ, PACS ఛైర్మన్ బలరాం రెడ్డి,  వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మెహన్ రెడ్డి, సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీచేయనైనది.

Share This Post