ప్రచురణార్థం —-2
తేదీ.4.5.2022

జగిత్యాల మే 04::- జిల్లాలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలతో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ జి.రవి అధికారులతో టేలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి రైతులకు భరోసా కల్పించాలని తెలియచేశారు.
ఇప్పటి వరకు జిల్లాలో 1546 మెట్రిక్ టన్నుల ధాన్యం 127 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 366 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అంచనా వేసి ఇప్పటి వరకు 187 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, అకాల వర్షాల వల్ల ధాన్యం లో తేమ శాతం అధికంగా ఉందని, దీనివల్ల కొంతమేర కొనుగోలు ఆలస్యమవుతుందని, చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని , ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా నాణ్యత ప్రమాణాలను ధృవీకరించిన తరువాతే దాన్యాన్ని కోనుగోలు చేయడం జరుగుతుందని, రైస్ మిల్లు లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ టేలీ కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, డి.ఏ.ఓ.,డి.ఎం. సివిల్ సప్ప్లై, డి.ఆర్.డి.ఓ., తహసీల్దార్లు వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.