ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య


ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా, నవంబర్- 24.
ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య
గురువారం నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ శివలింగయ్య తనిఖీ చేశారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల పాటు సిబ్బంది దఫాల వారీగా అందుబాటులో ఉంటారని ఇప్పటివరకు ఈ సెంటర్ కు ( 13 ) కాల్స్ వచ్చాయని అట్టి ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపించామని ఆయన తెలిపారు,
ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ధాన్యం కొనుగోలులో రవాణా చేయుటలో ధాన్యం కొనుగోలు సెంటర్లో వసతులపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్న వెంటనే 6303928718 నెంబర్ కు కాల్ చేయొచ్చని ఆయన తెలిపారు.

Share This Post