ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబరు 18 : గురువారం జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో ఐకేపి ద్వారా నిర్వహిస్తున్న ధాన్య కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వడ్లను కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టకుండా, వారి వారి కళ్ళాలలోనే ఆరబెట్టి కేంద్రానికి తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
(ఓపిఏం) అన్ లైన్ ఓటిపి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంట వేంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, కేంద్ర నిర్వాహకులు పి. నరేందర్, ఏఈఓ రెహానా బేగం తదితరులు ఉన్నారు.

Share This Post