ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

 

నందిపేట్ మండలం(నిజామాబాద్)

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నాడు నందిపేట్ /మల్లారం /ఐలాపూర్ లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 70 నుంచి 80 శాతం కోతలు పూర్తి అయినాయని అన్నారు.

ఎఫ్ ఏ క్యూ ధాన్యం కొనుగోలు 17% తేమ పర్సంటేజ్ ఉన్న ధాన్యం తో కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారని పి ఎ సి ఎస్, ఐ కె పి అన్ని సెంటర్లలో కొనుగోలు ప్రక్రియ వేగం పెంచుకుంటూ రవాణాను కూడా వేగం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి సిస్టమేటిక్ గా కొనాలని, ప్రతి రైతు బాధ్యత తప్పకుండ నాణ్యత గల వరి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. ఆ విషములో ప్రభుత్వానికి సహకరించాలని ఎఫ్ ఎ క్యూ ప్యాడి వచ్చినప్పుడు మిల్లర్ ను కొర్రీలు లేకుండా దింపుకోవాలని చెప్పగలుగుతామని, కడ్తా లేకుండా దింపుకోడానికి అవకాశం ఉంటుందని, వ్యవసాయ అధికారులు పిఎసిఎస్ సొసైటీ, సిబ్బంది రైతులకు సహాయ పడతారని, అగ్రికల్చర్ అధికారులు పిఎసిఎస్ చైర్మన్ సిబ్బంది ఎఫ్ ఎ క్యూ ఉన్న దాన్ని సపరేట్ లారీలో పంపాలని తెలిపారు. ఎఫ్ ఎ క్యూ లేని దాన్ని చెన్ని పట్టుకోవడం, క్లీన్ చేసుకొన్న తర్వాత తూకం వేసి పంపాలన్నారు. ఈ సెంటర్లలో వచ్చిన కంప్లైంట్ మిల్లు దగ్గరికి వెళ్లిన ధాన్యం నూక అవుతుందని కంప్లైంట్ రావడం జరిగిందన్నారు. రైతులు గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఎఫ్ ఏ క్యూ ప్రకారంగా ధాన్యం కొని మిల్లర్ కు పంపిస్తుంది మిల్లర్ నిబంధనల ప్రకారంగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికి సీ ఎం ఆర్ రూపంలో రైస్ డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుందని  ఎఫ్ ఎ క్యూ ధాన్యం పంపించే బాధ్యత కొనుగోలు సెంటర్ దని, రైతుల ది ఎఫ్ ఏ క్యూ కలిగిన ధాన్యాన్ని చేయడమని ఎలాంటి కటింగ్ లేకుండా దింపు కోవాల్సిన బాధ్యత రైస్ మిల్లర్ దని జిల్లాలో ఉన్న అన్ని రైస్ మిల్లర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడ ఎఫ్ ఏ క్యూ ధాన్యానికి కటింగు పెడితే ఆ మిల్లు పై గట్టిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే మీటింగ్ లో స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగిందని ఎఫ్ ఏ క్యూ ధాన్యాని వ్యవసాయ అధికారి సర్టిఫైడ్ చేసి పంపిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఈ విషయాలు పాటించాలన్నారు. ముఖ్యంగా మండలాలలో తహసిల్దార్ కొనుగోలు చేసే శాఖలు డివిజన్ స్థాయిలో ఆర్ డి వో లు జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ గారు డి సి ఓ గారు డి ఎం సి ఎస్ డి.ఎస్.ఒ అందరూ ఈ సీజన్లో ఎఫ్ ఏ క్యూ దాన్యం కు ఎలాంటి కటింగ్ లేకుండ మిల్లులో దించుకునే బాధ్యత ఈ అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డి సి ఓ war సింహాచలం, పి ఏ సి ఎస్ చైర్మన్ సుదర్శన్, ఎమ్మార్వో అనిల్ ఏవో సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post