ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, డిసెంబర్ 3:: శుక్రవారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కేంద్రం, మండలంలోని రామవరం, మొండ్రాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఆన్ లైన్ నమోదులు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దేవరుప్పుల మండలం మనుపడులో రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఎంత ధాన్యం వచ్చందని, రోజువారి ధాన్యం వివరాలు, అన్లోడ్ కు ఎంత సమయం పడుతున్నది అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఆర్డిఓ క్రిష్ణవేణి, డిసిఓ ఆర్. కిరణ్ కుమార్, తహసిల్దార్ రవిచంద్ర తదితరులు వున్నారు.

Share This Post