ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంటావేసి ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

డిశంబరు 23, ఖమ్మం

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంటావేసి ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా: కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వైరా , కొణిజర్ల మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. వైరా మండలం గన్నవరం క్లస్టర్, ఖానాపురం, అదేవిధంగా, కొణిజర్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే కాంటవేసిన ధాన్యాన్ని లారీల కోసం వేచి చూడకుండా ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించాలని, ఏరోజు డేటా ఎంట్రీని అదేరోజు పూర్తి చేసి రైతుల ఖాతాలకు పైకం జమ అయ్యెలా డేటా ఎంట్రీ ప్రక్రియ. జరగాలని కలెక్టర్ ఆదేశించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వి.ఆర్.ఓ, వి.ఆర్.ఏలకు బాధ్యతలను అప్పగించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈసారి కేవలం మన జిల్లలోని రైస్ మిల్లులను మాత్రమే కేటాయించడం జరిగిందని, మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకుండా, నిరంతరం పర్యవేక్షించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా సహాకార శాఖాధికారి విజయకుమారి, వైరా, కొణిజర్ల తహశీల్దార్లు అరుణ, సైదులు, ఎం.పి.డి.ఓలు వెంకటపతిరాజు, రమాదేవి, కొనుగోలు కేంద్రాలు బాధ్యులు స్థాని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post