*ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్*.

# *చిట్యాల,నార్కట్ పల్లి, మునుగొడ్, చండూర్, కనగల్,నల్గొండ మండలం లలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోళ్లు పరిశీలన*.      చిట్యాల,నార్కట్ పల్లి, మునుగొడ్, చండూర్, కనగల్,నల్గొండ,ఏప్రిల్ 22 .జిల్లా లో ధాన్యం కొనుగోలు కేంద్రాల కు ధాన్యం వస్తున్నందున వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యం రైతుల నుండి కొనుగోళ్లు నిర్వహించాలని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధుల ను  సమాచారం అందించి ప్రారంభించాలని ఆయన సూచించారు.శుక్రవారం అదనపు కలెక్టర్ పౌర సరఫరాలు,మార్కెటింగ్,వ్యవసాయ, డి.అర్.డి. ఏ అధికారులతో కలిసి చిట్యాల,నార్కట్ పల్లి,మును గోడ్, చండూర్, కనగల్,నల్గొండ మండల కేంద్రం లలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోళ్లు పరిశీలించి అధికారులకు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పలు సూచనలు చేశారు.  చిట్యాల మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన కొను గొలు కేంద్రాన్ని,నార్కట్ పల్లి మండలం లో బ్రాహ్మణ వెళ్ళం లో ఐ కె పి కేంద్రాన్ని, మునుగోడ్ మండలం లో కచిలా పురం లో పి. ఏ.సి.ఎస్.ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పలివెల గ్రామం లో ఐ కె పి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చండూర్ మండల కేంద్రం లో మార్కెట్ యార్డ్ లో మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని, కనగల్ మండలం లో కనగల్  గ్రామం లో పి. ఏ.సి.సి.ఎస్.సెంటర్, పర్వత గిరి గ్రామం లో ఐ కె పి కేంద్రాన్ని,నల్గొండ మండలం బత్తాయి మార్కెట్లో మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేసి కొనుగోళ్లు పరిశీలించి సమస్యలు తెలుసుకుని అధికారులు,కొనుగోలు కేంద్రాల ఇంఛార్జి లకు పలు సూచనలు చేశారు.వాతావరణం లో మార్పు వలన అకాల వర్షం పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు చేసిన  ధాన్యం తడవకుండా టార్పాలిన్ లు కప్పి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఇప్పటికీ మండలం లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున మిగతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా త్వరగా ప్రారంభించి కొనుగోళ్లు నిర్వహించాలని ఆయన అన్నారు.జిల్లాలో సహకార శాఖ,మార్కెటింగ్,జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ ద్వారా 241 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు చేయాలని నిర్ణయం తీసుకోగా ఇప్పటి వరకు 62  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 22,926 క్వింటాళ్ల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఐ కె పి ద్వారా 134 కొను గోలు కేంద్రాలకు గాను 35 కేంద్రాలు,సహకార శాఖ ద్వారా 99 పి. ఏ.సి.ఎస్ కేంద్రాలకు గాను 23 కేంద్రాలు,మార్కెటింగ్ శాఖ ద్వారా 8 కొనుగోలు కేంద్రాలకు గాను 4 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వెల్లడించారు 13 లక్షల గన్నీ సంచులు కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసినట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు పంపించాలని అన్నారు.కొనుగోలు కేంద్రాల లో వ్యవసాయ విస్తరణ అధికారులు తేమ శాతం కొలువాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సెంటర్ ఇంఛార్జి లు బాధ్యత వహించాలని అన్నారు.కొనుగోలు కేంద్రాలలో ఎండ తీవ్రత నుండి నీడ కల్పించేందుకు షెడ్ ఏర్పాటు చేయాలని,త్రాగు నీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అదనపు కలెక్టర్ తో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,జిల్లా వ్యవసాయ శాఖ జె.డి.సుచరిత,మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్,జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఏ పి.యం అరుణ్,స్థానిక తహశీల్దార్ లు ఉన్నారు

*ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్*.

Share This Post