ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ఈ.కె.పి. సిబ్బందికి శిక్షణ… డిఆర్ డిఓ శ్రీనివాస్

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ఈ.కె.పి. సిబ్బందికి శిక్షణ… డిఆర్ డిఓ శ్రీనివాస్

ల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఐ.కె.పి . సిబ్బందికి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ఏ పీ ఎం లు ,సీసీలు, వివో ఏ లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సీజన్ లో ఐకేపీ ద్వారా 102 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకాల వర్షాలకు ధాన్యము తడిసి పోకుండా సరిపోయినన్ని టార్పాలిన్ సమకూర్చుకోవాలని తెలిపారు. గోనె సంచుల వివరాలు జాగ్రత్తగా నమోదు చేసుకోవాలని, సెంటర్ ముగిసిన వారం లోపల రికన్సి లేషన్ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి కావలసిన మౌలిక సదుపాయాలు సంబంధిత ఏ ఎంసీల నుండి తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తర్వాత ఏ రోజుది ఆరోజు ట్యాబ్ లో ఎంట్రీ పూర్తి చేయాలని శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈసారి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లను మార్చామనిఎటువంటి ఇబ్బందులునడవని అన్నారు. గోనెసంచులకు సంబంధించి గాని, రైస్ మిల్లులకు సంబంధించి గాని ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అడిషనల్ డి ఆర్ డి ఓ భీమయ్య మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనేటప్పుడు రైతులకు సంబంధించిన ఆధార్, పాస్ బుక్ జిరాక్స్ కాపీలను ధాన్యం కొనుగోలు కంటే ముందే తీసుకోవాలని తెలిపారు. గోనే సంచులు లెక్కలు పక్కాగా ఉండేటట్లు చూసుకోవాలని , ట్యాబ్ ఎంట్రీ కూడా వెంట వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లో డి పి ఎం మోహన్, వివిధ మండలాల ఏపిఎం లు సీసీలు వివోఏ / ట్యాబ్ ఆపరేటర్లు జిల్లా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post