ధాన్యం కొనుగోలు కేంద్రాలు పటిష్టంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పటిష్టంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పటిష్టంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్, ఏప్రిల్ -28:

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లాలోని (18) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, ఎఫ్. ఎస్.సి.ఎస్. అధ్యక్షులు, జిల్లా అధికారులతో వరీ ధాన్యం కొనుగోలు కేంద్రాల పటిష్ట నిర్వహణపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంతకు ముందు వానాకాలం లో సమావేశం నిర్వహించుకున్నామని, ఇంతకు ముందు సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించడం జరిగిందని, ఈ సారి విస్తీర్ణం తగ్గిందని, సమస్యలు రాకుండా సమన్వయంతో వ్యవహరించి రైతులకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని తెలిపారు.

రైతుల అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైస్ మిల్లర్ లు ట్రాక్టర్ లను అంగీకరించాలని, గతంలో ఇబ్బంది పెట్టిన రవాణా సిబ్బంది పై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రారంభించే కేంద్రాలకు గన్ని బ్యాగ్ లను పంపిస్తాము అని, మీకు ఇచ్చిన గన్ని బ్యాగులను చూసుకొని చినిగి పోయిన వాటిని వాపసు చేయాలని, ముట్టినట్లు రసీదు ఇవ్వాలని తెలిపారు. చేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ట్రక్ షీట్ ఇచ్చి ఖర్చులు సొసైటీ రీ ఇంబర్స్ మెంట్ పొందాలని, రైతులు ధాన్యం శుబ్రపరిచే విధంగా అవగాహన కలిగించి ఒక్క కిలో తగ్గకుండా చెల్లింపులు చేయాలని తెలిపారు.

సెంటర్ వారీగా సమీక్ష చేస్తున్నామని, సెంటర్ లలో సమస్యలు కల్పించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు సమస్య వుంటే తెలపాలని అన్నారు.

చైర్మన్లు మాట్లాడుతూ, 18 సంఘాల ద్వారా ప్రస్తుతం 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించామని, గతంలో తమ సూచనలు తో కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం తమ ఆదేశాల ప్రకారం కేంద్రాల నిర్వహణ చేపట్టి విజయవంతం చేస్తామని తెలిపారు.

అనంతరం ప్యాడి కమిషన్ చెక్కులను జిల్లా కలెక్టర్ సంబంధిత ప్యాక్స్ చైర్మన్ లకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి సయ్యిద్ ఖుర్షీద్, డి ఎం మహేందర్, డి ఎస్ ఓ నర్సింగ్ రావు, డి ఏ ఓ చత్రు నాయక్, కార్మిక శాఖ అధికారి రమేష్, జి.సీసీ మేనేజర్ సమ్మయ్య, ఆర్టీవో, (18) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డిఎస్.ఓ. కార్యాలయ
డి.టి. నారాయణ రెడ్డి, ఎఫ్.ఏ.సి. సభ్యులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post