ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ల నే వినియోగించాలి…

ప్రచురణార్థం

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ల నే వినియోగించాలి…

మహబూబాబాద్ నవంబర్ 3.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వెల్డింగ్ మిషన్ లనే వినియోగించాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ళ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లనే వినియోగించాలని ఆదేశించారు.

జిల్లాలో 2.14 ,463 ఎకరాలలో వరి పంట సాగు చేసినందున ధాన్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా వరి పంట సాగు ను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో 231 నుండి 235 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున ప్రతి కొనుగోలు కేంద్రానికి ట్యాబ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు.ట్యాగింగ్ చేసిన తర్వాత అక్కడే విక్రయింపులు జరపాలన్నారు. ప్రతి సెంటర్ కు 30 టార్పాలిన్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి సెంటర్ లో 2 మాయిశ్చర్ మీటర్లు ,ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ ఏర్పాటు చేయాలన్నారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రిజిస్టర్లో నమోదు చేయాలని రసీదు ఇవ్వాలన్నారు రవాణా లో ఎటువంటి అంతరాయాలు జరగకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మిల్లర్స్ ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కు తెలియజేశారు లీగల్ మెట్రాలజీ అధికారులతో వేయింగ్ బ్రిడ్జీలు చెక్ చేయించాలని అన్నారు.

జిల్లాలో ధాన్యం ముందుగా పెద్దవంగర, కొత్తగూడ మండ లాల లో వస్తున్నందున కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు పై ముద్రించిన పోస్టర్లను కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, కొమరయ్య, డిఆర్డిఎ పిడి సన్యాస య్య, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, dm civil supplies మహేందర్, వ్యవసాయ అధికారి చత్రు నాయక్, మార్కెటింగ్ అధికారి వెంకట్ రెడ్డి సహకార శాఖ అధికారి ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post