నల్గొండ, కనగల్, మే 5. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కలెక్టర్ వి. చంద్రశేఖర్ తనిఖీ చేశారు గురువారం నల్గొండ మండలం జి. చెన్నారం లో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం, కొత్తపల్లి గ్రామంలో ఐ కేపి కేంద్రం, కనగల్ మండలం లో కనగల్ గ్రామంలో పి. ఏ.సి ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, లచ్చు గూడెం గ్రామంలో ఐకెపి సెంటర్ , బుడ మర్లపల్లి గ్రామం లో పి. ఏ.సి.ఎస్.కేంద్రాలను తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రాలలో హమాలీ లు కొరత గమనించి హమాలీ లు తగిన సంఖ్య లో ఏర్పాటు చేసుకొని ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే తరలించాలని ఆదేశించారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం లో తూకం వేసి ఉన్న ధాన్యం రాశులు రవాణా కు సెంటర్ కు 3,4 లారీలు ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల డి.యం.ను ఆదేశించారు. కనగల్, లచ్చు గూడెం, బుడ మర్ల పల్లి కేంద్రం లలో కాంటా లు రిపేర్ లో వుంటే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని అదనపు కలెక్టర్ సెంటర్ నిర్వాహకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంటా లు రిపేర్ చేసి పంపాలని మార్కెటింగ్ ఏ.డి. ని ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 82 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 226 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 43 కోట్ల 66 లక్షలు రూ.లు రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు.ధాన్యం రవాణా లో లారీ లు, గన్నీ లు ఇతర సమస్య వుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కు తెలుపాలని కోరారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు
