ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్*

నల్గొండ, కనగల్,నవంబర్ 8.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ)వి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ నల్గొండ మండలం లోని ఎం.దుప్పల పల్లి ఐ. కె.పి.వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, గంధం వారి గూడెం లో పి.ఏ.సి.ఎస్.కొను గోలు కేంద్రం,కనగల్ మండలం పర్వత గిరి ఐ. కె.పి.ధాన్యం కొనుగోలు కేంద్రం,నల్గొండ పట్టణం లోని ఎస్.ఎల్. బి.సి.లో మార్కెటింగ్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేసి కొనుగోళ్ల ను పరిశీలించారు. ఎం.దుప్పల పల్లి లో ఐ. కె.పి.వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో తేమ శాతం వచ్చిన ధాన్యం ను తూకం వేయకపోవటం గమనించి వెంటనే తూకం వేసి కొనుగోళ్లు చేయాలని సెంటర్ ఇంచార్జి ని ఆదేశించారు.గంధం వారి గూడెంలో ధాన్యం రాశులు ఉన్నప్పటికి కోనుగోలు ప్రారంభించక పోవడం తో వెంటనే వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. ఏ.ఈ. ఓ.,సెంటర్ ఇంచార్జి లేక పోవడం తో అదనపు కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తో మాట్లాడి ఏ.ఈ. ఓ.లను కొనుగోలు కేంద్రాల లో అందుబాటులో ఉండి తేమ శాతం రికార్డ్ చెయాలని సూచించారు.
కనగల్ మండలం పర్వత గిరి లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని,హమాలీ లు పెంచి లిఫ్టింగ్, లారీ లు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు రవాణా చేయాలని అన్నారు.ఏ.ఈ. ఓలు తేమ శాతం సర్టిఫికెట్ లో రికార్డ్ చేసి సంతకం పెట్టాలని సూచించారు.నల్గొండ పట్టణంలో ఎస్.ఎల్.బి.సి.కొనుగోలు కేంద్రం లో నాలుగు లారీ లు ఉండగా,3 లోడ్ చేయడం గమనించి రోజూ 8 లారీలు ,హమాలీ లు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేసి ధాన్యం మిల్లుకు రవాణా చెయాలని సెంటర్ ఇంచార్జి ని ఆదేశించారు.సెంటర్ ఇంచార్జి లు కొనుగోలు చేసేప్పుడు రైతు వద్ద ఆధార్ కార్డ్,బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం,పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ లు తీసుకోవాలని సూచించారు.లేకుంటే ట్యాబ్ ఎంట్రీ, చెల్లింపు లు ఇబ్బంది ఏర్పడి జాప్యం జరుగుతుందని అన్నారు.రైతులు కోత తర్వాత ఆరబెట్టి తాలు,మట్టి లేని నాణ్యమైన ధాన్యం,17 శాతం తేమ మించకుండా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.సంబంధిత జిల్లా అధికారులు,సూపర్వైజరీ అధికారులు ప్రతి రోజు కొనుగోళ్లు పర్యవేక్షణ చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యా నందం,డి.ఆర్.డి.ఓ.డి.పి.యం.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్*

Share This Post