ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి…

ప్రచురణార్థం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి…

మహబూబాబాద్, నవంబర్ 24:

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం క్యాంపు కార్యాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో 30 టార్పాలిన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గన్ని బ్యాగ్స్ కూడా సిద్ధంగా ఉంచా మన్నారు. మాయిశ్చర్ మీటర్స్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లు అన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు ధాన్యాన్ని పరిశీలించి తేమశాతం 17 ఉంటే టోకెన్ జారీ చేసి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేయాలన్నారు.

మిల్లులకు దగ్గరగా ఉన్న చోట ట్రాక్టర్ ల చే రవాణా చేయించాలని, 25 కిలోమీటర్ల కన్నా దూరంగా ఉన్నా కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని లారీల ద్వారా తరలించాలి అన్నారు. రైతు వేదిక లో ఉన్న ధాన్యాన్ని వెంటనే ఫంక్షన్ హాల్స్ కు తరలించాలని ప్రస్తుత ధాన్యాన్ని తరలించేందుకు రైతు వేదికలను సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు.

అధికారులు కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post