ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-1

జనగామ, డిసెంబర్ 2 : గురువారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా దేవరుప్పుల మండలం కోలుకొండ, అప్పిరెడ్డి పల్లె, పాలకుర్తి మండలం తొర్రూరు (జె) గ్రామాల కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యంను కొనుగోలు చేసి వెంటనే తరలించాలని అన్నారు. రైతులకు ధాన్యానికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. రైతులు ఆధార్ కార్డు సెల్ ఫోన్ నెంబర్ కు అనుసంధానం లేని వారికి కొనుగోలు కేంద్రం వద్దనే అనుసంధాన ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని సంబందిత సిబ్బందిని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ధాన్యం తరలించే హమాలీలను అందుబాటులో ఉంచాలని అన్నారు. అనంతరం కలెక్టర్ కోలుకొండలో రైస్ మిల్లును తనిఖీ చేసి, రోజుకు ఎంత ధాన్యం వస్తుందో మిల్లు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగు నీరు, విద్యుత్తు కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని, కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ జి. రాంరెడ్డి, డిసిఓ కిరణ్ కుమార్, ఏపిడి కొండల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Share This Post