*ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సందర్శించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సందర్శించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12: మండల పరిధిలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతీరోజూ సంబంధిత మండల తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సందర్శించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మండల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు సరళిని తహశీల్దార్లు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. ధరణి, మీసేవ దరఖాస్తులు, తదితర రెవెన్యూ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని, దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు. రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం వారితో ఒక సొసైటీ ఏర్పాటు చేయించాలని అన్నారు. కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మినీ స్టేడియంల నిర్మాణం కోసం మండల కేంద్రంలో స్థలం గుర్తించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, సిరిసిల్ల మండల తహసీల్దార్ విజయ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రవికాంత్, సుజాత, రమేష్, శ్రీకాంత్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post