ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*ధాన్యం కొనుగోలు చేసే సమయంలో
రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలి : జిల్లా శ్రీ అనురాగ్ జయంతి*

——————————

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులేదేనని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు.

శనివారం IDOC మిని మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇప్పటికే అవునూర్, గూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిసినందున ధాన్యం రాబడులను బట్టి మిగతా కొనుగోలు కేంద్రాలను తెరవాలని ఆన్నారు.
ప్రాధాన్యతను బట్టి అన్ని కొనుగోలు కేంద్రాలకు మిషనరి నీ చేర్చాల్సిన బాధ్యత, వాటిని కండిషన్ లో ఉండేలా చూడాల్సిన బాధ్యత మార్కెటింగ్ అధికారులదేనని చెప్పారు. అలాగే అన్ని కేంద్రాలలో సరిపడా కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్ లు ఉండేలా చూసుకోవాలని అన్నారు.

ఇప్పటికే అందరికీ ధాన్యం వివరాల ను నిర్దేశిత అప్లికేషన్ లో నమోదుకు లాగిన్, పాస్ వర్డ్ లు వచ్చినందున
సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేసేలా చూడలన్నారు.

ఇప్పటికే ధాన్యం తరలింపుకు సంబంధించిన వాహనాలకు సంబంధించి వాహన యజమానులతో ఒప్పందం ను పౌర సరఫరాల సంస్థ చేసుకున్నందున కొనుగోలు చేసిన ధాన్యం ను వెనువెంటనే రైస్ మిల్లుల కు తరలించాలని సూచించారు.
ముందే చెప్పినట్టు అవసరమైన సందర్భంలో
ధాన్యం ను నిల్వ చేసేందుకు సరిపడా స్టోరేజ్ పాయింట్ లను గుర్తించి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

కొనుగోలు కేంద్రం ఇన్ ఛార్జిలు ట్యాబ్ లో నమోదు చేస్తున్న వివరాలను, ధాన్యం నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా నిర్ధారిస్తుందని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కొనుగోలు నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం చేసి, వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.

మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దింపుకొని రసీదులు మిల్లర్లలు ఇచ్చేలా చూడాలన్నారు.ట్యాబ్ ఎంట్రీ, తూకం చేయడంలో జాప్యం లేకుండా చూడాలన్నారు.

గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 17 లక్షల గన్ని బ్యాగులు ఉన్నట్లు పౌర సరఫరాల అధికారులు స్పష్టం చేస్తున్న దృష్ట్యా … తహశీల్దార్ ల పర్యవేక్షణలో మరోసారి లెక్కించాలన్నారు. మిల్లర్ ల వద్ద ఉన్న ఖాళీ గన్ని లు వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు.
గన్ని ల బాధ్యత లు VRO లకు అప్పగించాలని అన్నారు.

ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద షామియానా, త్రాగునీరు, ORS ప్యాకెట్ లు, ఫస్ట్ ఏయిడ్ కిట్ ఉండేలా చూసుకోవాలని అన్నారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చేటప్పుడు నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాల మేరకు తేమ శాతం చూసుకొని తెచ్చేలా వారిని చైతన్యం చేయాలన్నారు.
తమ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓ లు తరచూ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ…. ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓలు శ్రీనివాస్ లీల, dcso జితేందర్ రెడ్డి, dmcs హరి కృష్ణ, dto కొండల్ రావు, dao రణధీర్ కుమార్, dco బుద్ధ నాయుడు, dmo ప్రవీణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు
————————–

Share This Post