ప్రచురణార్థం
మహబూబాబాద్ డిసెంబర్ 1.
జిల్లాలో ధాన్యం విక్రయాలకు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాలు జరపాలని ఆదేశించారు.
230 కేంద్రాలలో 27 మాత్రమే ఏర్పాటు చేయగా 123 కేంద్రాలలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయన్నారు.
ప్రతి కేంద్రంలో ఒక్క ధాన్యం కొనుగోలైన తప్పనిసరిగా జరగాలని అందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం కొనుగోలు జరుగుతున్నట్లు ప్రజలకు తెలియాలని విస్తృత ప్రచారం చేయాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒక్కరోజు కుమించి కొనుగోలు చేసిన ధాన్యం నిలువ ఉంచరాదన్నారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డిఆర్డిఓ సన్యాసయ్యా డిసిఓ కుర్షిద్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ పౌర సరఫరాధికారి నర్సింగరావు సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి
డిటి నారాయణరెడ్డి డిపిఎం నలిని నారాయణ జి సి సి మేనేజర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.