ధాన్యం కొనుగోలు ప్రక్రియను లైట్గా తీసుకుంటే పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయని, కొనుగోలు ప్రక్రియ చాలా పకడ్బందీగా, పద్యాగా జరగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

బుధవారం కొత్తగూడెం క్లబ్బు నందు ఖరీఫ్ దాన్యం కొనుగోళ్లుపై పౌరసరఫరాలు, పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లుపై మార్కెటింగ్, వ్యవసాయ, డిఆర్డిఓ, సహాకారశాఖ, జిసిసి, ఐకేపి, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాలు ఇన్చార్థులు, నీఈఓలతో జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ. కొనుగోలు ప్రక్రియ నిర్వహణకు సిఎసిఎస్ 107, అజేపి 11, జిసిసి 29, మార్కెటింగ్ 07 మొత్తం 154 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లుపై కేంద్రం ఇనార్థాలతో పాటు రైతులకు సమగ్ర అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. రైతుకు మద్దతు ధర రావాలని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, కనీస మద్దుతు ధర కంటే తక్కువకు విక్రయించి మోసపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయాలు నిర్వహించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 1960, ముతక రణానికి 1940 రూపాయలుగా ప్రభుత్వం ధరలు నిర్ణయించినందున రైతులు: ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త, తాలు, పొల్లు, పొట్టు, మట్టిలేకుండా శుభ్రపరిస్తే మద్దతు ధర లభిస్తుందని చెప్పారు కనీస మద్దుతు ధరకు రైతులకు క్లస్టర్ వారిగా రైతునేదిక కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యత పాటింపుపై రైతులకు అవగాహన కల్పించక పోవడం వల్ల కేంద్రాలకు వచ్చిన తరువాత సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు షెడ్యూలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గుపెట్టడం, ఓపియం ఎస్లో నమోదు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రాల ఇన్చార్ట్లు పట్టించుకోక పోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోళ్లలో వ్యత్యాసం ఎందుకొస్తుందని, లెక్క పక్కాగా ఉండాలని, తెలియదనుకుంటే పొరపాటేనని కేంద్రం ఇన్చార్డ్, సిఈఓ, జిల్లా అధికారిపై చర్యలు తీసుకుంటానని వేతనం నుండి రికవరీ చేస్తానని హెచ్చరించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పన, ఏర్పాట్లుపై ప్రత్యేక అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని ఏర్పాట్లుపై నివేదికలు ఇవ్వాలని చెప్పారు. గన్నీ సంచుల కొరత రాకుండా చూడాలని, గన్నీ సంచులు ఇచ్చిన రైతుల వివరాలు రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. గన్నీ సంచులకు కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు ఇవ్వాలని, బయట ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. విక్రయాలు నిర్వహణకు రైతులకు గ్రామాలు, క్లస్టరు వారిగా కూపన్లు జారీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించుటలో అవగాహన లేమి వల్ల సమస్యలు వస్తున్నాయని, అవగాహన ఉంటే సమస్యలు సమసిపోతాయని చెప్పారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి ధాన్యం గింజ కూడా మన జిల్లాకు రావడానికి వీల్లేకుండా పటిష్టమైన తనిఖీలతో పాటు చెకోపోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రతి రూపాయి రికవరీ చేస్తామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయుటకు లారీలు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు రాకుండా మిల్లులకు వెళ్లిన ధాన్యం తిరిగి రాకుండా మిల్లర్లుతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మిల్లులు ట్యాగింగ్ షెడ్యూలు తయారు. చేయాలని చెప్పారు. అనంతరం వరి పంటకు మద్దుతు ధర, ధాన్యం సేకరణ కనీస మద్దుతు ధర కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిసిఓ చంద్రప్రకాశ్, డియం ప్రసాద్, డిఆర్డిఓ మధుసూధన్ రాజు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, జిసిసి మేనేజర్ వాణి, మార్కెటింగ్ అధికారి అలీం, వ్యవసాయ అధికారులు, మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షులు జుగల్ కిషోర్, ఐకేపి, పిఎసిఎస్, మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post