ధాన్యం కొనుగోలు ప్రక్రియ పైన సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంగేమ్ మండలం లోని 3 రైస్ మిల్లు లలో ఆకస్మిక తనిఖీ నిర్వహించా

వరంగల్

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పైన సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంగేమ్ మండలం లోని 3 రైస్ మిల్లు లలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు

సంగేమ్ మండలం కాపుల కనపర్తి లోని శ్రీ సాయి, శ్రీవాణి, తిరుమల రైస్ మిల్లులను కలెక్టర్ సందర్శించి స్టాక్, CMR కి సంబందించి A, B రిజిస్టర్ లను పరిశీలించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు, కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా
టోకెన్ సిస్టం ద్వారా ధాన్యం ను త్వరగా దింపుకోవాలన్నారు

ప్రభుత్వ ధాన్యం ను దింపుకోకుండా అలసత్వం వహిస్తున్న శ్రీ సాయి రైస్ మిల్లర్ కు… రైస్ మిల్లర్, సివిల్ సప్ప్లై చేసుకున్న అగ్రిమెంట్ క్లాజ్ 32 ప్రకారం
షో కాజ్ నోటిస్ ను కలెక్టర్ జారీ చేసారు

శ్రీవాణి రైస్ మిల్లు కు సంబందించి 24 గంటలలో ధాన్యాన్ని దింపుకోవాలని, హమాలీలు 3 షిఫ్ట్ లలో పనిచేయలన్నారు

తిరుమల రైస్ మిల్లర్ లలో కలెక్టర్ రిజిస్టర్ లను పరిశీలించారు

తిరుమల మిల్లుకు సంబందించి
డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని dm సివిల్ సప్ప్లైను కలెక్టర్ ఆదేశించారు

ఈ కార్యక్రమం లో సివిల్ సప్ప్లై DM ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Share This Post