ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి.. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి..

అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
00000

వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వారి చాంబర్లో రైస్ మిల్లర్లు, కోనుగోలు కెంద్రాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు ధాన్యంలో కోత విధించకూడదని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా కేటాయించిన రైస్ మిల్లులకు పంపించిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని రైస్ మిల్లర్లకు ఆయన సూచించారు . ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు .ధాన్యం కొనుగోలు సందర్భంలో రైతుల వివరాలు ఆన్ లైన్లో నమోదు చేసినపుడు ఎదురౌతున్న సమస్యలను అధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ డి.ఎం. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్, సెక్రటరీ అన్నమనేని సుధాకర్, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post