ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

జనగామ,నవంబర్.15,
ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహసీల్దార్లు , మండల ప్రత్యేక అధికారులు ఏఈఓలు, సంబంధిత అధికారులతో కొనుగులు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలును వేగంగా చేపట్టాలని,రోజు వారీగా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించాలని తహసీల్దార్ లకు ఆదేశించారు. ఎక్కడ కూడా కొనుగోలులో ఎటువంటి అవకతవకలు జరుగకుండా రవాణా చేయాలని అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జనగామ ఆర్డిఓ మధు మోహన్, డిఆర్డిఓ రాంరెడ్డి, జెడ్పీ సీఈవో ఎల్.విజయ లక్ష్మి, డిఎస్ఓ రోజా రాణి, డిఏం సంధ్య రాణీ, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post