ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి:తోలి సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి:తోలి సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు

– కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో సరిపడా స్టోరేజ్ పాయింట్ లను వెంటనే గుర్తించాలి
– గన్ని బ్యాగుల కొరత లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి
– లోడింగ్ , అన్ లోడింగ్ వేగంగా జరగడం పై ప్రత్యేక ద్రుష్టి సారించాలి

– రైతులకు సాధ్యమైనంత త్వరగా పే మెంట్ లు జరిగేలా చూడాలి.

——————————
సిద్దిపేట 17, నవంబర్ 2021:
——————————

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు అన్నారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ తోలి సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో411 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయగా, బుధవారం నాటికి 408 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీ హరీష్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

జిల్లాలో వానాకాలం పంట 6 లక్షల 86 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనా ఉందన్నారు .
ఇప్పటి వరకు జిల్లాలో 46 వేల 633 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీ హరీష్ తాజా ప్రగతి ని వివరించారు . మొత్తం ధాన్యం సేకరణ కు ఒక కోటి 70 లక్షల గన్ని బ్యాగులు కావాల్సి ఉండగా ప్రస్తుతం 50 లక్షల బ్యాగులు ఉన్నాయన్నారు .

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సజావుగా జరిగేందుకు అధికారులకు సూచనలు చేసారు .

కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో సరిపడా స్టోరేజ్ పాయింట్ లను తహశీల్దార్ ల సహాయంతో వెంటనే గుర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు ఆదేశించారు .

జిల్లాలో ఇంకనూ ప్రారంభం కాని, కొనుగోలు కేంద్రములను వెంటనే ప్రారంభించాలన్నారు.
ప్రతి కొనుగోళ్ళు కేంద్రములో సరిపడు టార్పాలిన్ లు, గోనె సంచులు, తూకం, తేమ శాతం చూసే యంత్రములు అందుబాటులో ఉంచాలన్నారు.

కేంద్ర నిర్వాహకులు రైతుల యొక్క వివరములు ఆన్లైన్ లో ఏరోజుకారోజు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. రైతులకు సాధ్యమైనంత త్వరగా పే మెంట్ లు జరిగేలా చూడాలన్నారు .
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే
జిల్లాలో ఉన్న ప్రతి రైస్ మిల్లర్ ధాన్యమును తప్పనిసరిగా దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ తో అగ్రిమెంట్ చేసుకోనేలా rdo లు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్ళు సజావుగా జరగడానికి వాహనములను సకాలంలో సమకూర్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా రవాణా అధికారి దే నన్నారు . రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు . ధరణి పెండింగ్ ఆర్జీల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు . సాధ్యమైనంత త్వరగా పెండింగ్ ఆర్జీలను పరిష్కరించాలని rdo లు ,తహసిల్దార్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు .

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, రెవెన్యూ డివిజన్ అధికారులు శ్రీ జయ చంద్రా రెడ్డి, శ్రీ విజయేంద్ర రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీ హరీష్, DRDO శ్రీ గోపాల్ రావు, జిల్లా సహకార అధికారి శ్రీ చంద్ర మోహన్ రెడ్డి , సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు .

——————————
డీ.పీ.ఆర్.ఓ, సిద్ధిపేట కార్యాలయంచే జారీ చేయనైనది.
పాల్గొన్నారు.

Share This Post