ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల ఖాతాలలో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు భువనగిరి మండలం చందుపట్ల ప్యాక్స్ పరిధిలోని చందుపట్ల, వీరవెల్లి గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తూనిక యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు, ఫ్యాన్లు, గన్నీ బ్యాగులు సిద్ధం చేసుకొని రేపటి నుండి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో మంచి నీటి వసతి, టెంట్ సౌకర్యం కల్పించాలని, రైతుల నుండి వేగంగా కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల నుండి కొనుగోళ్ల అనంతరం ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి రైతుల ఖాతాలలో నగదు సకాలంలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమతి పరిమళ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఈశ్వర్, ప్యాక్స్ సిఇఓ రాములు, తదితరులు పాల్గొన్నారు .

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల ఖాతాలలో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

Share This Post