*ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*ప్రచురణార్ధం-2
జనగామ, నవంబరు 28 : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు.
ఆదివారం కలెక్టర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఓటర్ నమోదు కార్యక్రమం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు తనిఖీ చేశారు. కలెక్టర్, జనగామ మండలంలో పెంబర్తి, సిద్దంకి గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలను ధాన్య కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ఇంతవరకు ఎంతమేర ధాన్యం కొనుగోలు చేసింది, ఎంత మేర రవాణా చేసింది, ఎంత మంది రైతులనుండి కొనుగోలు చేసింది అడిగి తెలుసుకున్నారు. రైతుల వివరాల ఆన్లైన్ నమోదు, ట్రక్ షీట్ నమోదులు వెంట వెంటనే చేపట్టి, రైతులకు త్వరితగతిన వారి ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. కావాల్సినన్నీ గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం పెంబర్తి ప్రాధమిక పాఠశాలలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎంత మంది క్రొత్త ఓటర్లు నమోదు అయింది, ఎంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళింది, మరణించిన వారి పేర్లు జాబితా నుండి తొలగించింది వివరాలు బిఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా సవరణలు ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతీయువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్కడి నుండి రఘునాథ్ పల్లి, మండలంలో కుర్చపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని, బృహత్ పల్లె ప్రకృతి వనం ను కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు ఎప్పటికప్పుడు నమోదుచేయాలని, ధాన్యం కేంద్రాలలో నిల్వ ఉంచకుండా, సంబంధిత మిల్లులకు వెంట వెంటనే తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. అక్కడి నుండి కలెక్టర్ స్టేషన్ ఘనపూర్ లో బృహత్ పల్లె ప్రకృతి వనంను మండలంలోని చాగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన, జిల్లాలో ధాన్య కొనుగోలు సజావుగా జరిగేందుకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పిఎసిఎస్, ఎయంసిల ద్వారా 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, తేమ పరీక్ష యంత్రాలు, ప్యాడి క్లినర్లు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు కావాల్సినన్ని అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోళ్ళు ముమ్మరంగా జరుగుతున్నట్లు, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కొనుగోలు కేంద్రాల తనిఖీల్లో రైతులు అధికారులతో మాట్లాడి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యల ఎప్పటికప్పుడు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్ పర్యటన సందర్భంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, ఆర్డిఓ మధుమోహన్, డిఆర్డిఓ జి. రాంరెడ్డి, డిసిఎస్ఓ కిరణ్ కుమార్, తహశీల్దార్ రవీందర్, అధికారులు తదితరులు వున్నారు.

Share This Post