ప్రచురణార్ధం…1
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 14
రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన సంఘటన పై ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ పేదవాడికి అందేలా ప్రతి ఉద్యోగి మరియు సభ్యులు చొరవ చూపాలి:ఎం ఎల్ ఏ గండ్ర వెంకట రమణా రెడ్డి
పార్టీలకు అతీతంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి : జెడ్పి ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిణీ
మంగళవారం జెడ్పిసమావేశ మందిరం లో జెడ్పి ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి అధ్యక్షతన సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర రమణా రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ధాన్యం కొనుగోలుకు సంభందించిన అంశం పై సభ్యులు ఏకాగ్రీవ తీర్మాణం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ లో జరిగిన ఈ సంఘటనను పూర్తిస్థాయిలో విచారణ జరిపించి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.ఈ సమావేశంలో ఎం.ఎల్.ఏ గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా సంభందిత ప్రభుత్వ అధికారులు సభ్యులు చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పి ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీ మాట్లాడుతూ గౌరవ సభ్యులు పార్టీలకు అతీతంగా సభలో ఒకరినొకరు గౌరవించుకొని ప్రజా సమస్యలను లేవనెత్తుతు సమస్యల పరిష్కారానికి మార్గం చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మొత్తం 11 ఎజెండా అంశాలపై చర్చ కొనసాగగా సంబంధిత అధికారులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, జెడ్పి సి ఈ ఓ రఘువరన్,గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ జిల్లాలోని జెడ్పి టి సి లు, ఎం పి పి లు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పౌరసంభందాల అధికారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చే జారిచేయనైనది