ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

*ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి :జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్*

———————————-

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అన్ని మండలాల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,18,893 ఎకరాల్లో వరిసాగు చేయడం జరిగిందని, 2,97,232 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందని అన్నారు. 265 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ళు వేగవంతంగా పూర్తయ్యేలా సంబంధిత తహశీల్దార్లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి వాహనాలు అందుబాటులో ఉన్నవి, లేనివి అనే అంశాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే ధరణి, రెవెన్యూ సమస్యలు, కోర్టు కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, మీసేవ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సారించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు రవికాంత్, సుజాత, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
———————————————-

Share This Post