ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి…

ప్రచురణార్థం

ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి…

మహబూబాబాద్ నవంబర్ 6.

ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ముందుగా ధాన్యం వచ్చే ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

తేమశాతం తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. తూర్పారబట్టిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. టార్పాలిన్లు, గన్ని బ్యాగ్స్ అందుబాటులో ఉంచాలని రవాణ, స్టోరేజి వంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమురయ్య డిఆర్డిఎ పిడి సన్యాసయ్య dm civil supplies మహేందర్ సహకార శాఖ అధికారి ఖుర్షీద్ మార్కెటింగ్ అధికారి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
——————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post