ధాన్యం కొనుగోళ్లను అవగాహనతో చేపట్టాలి…

ప్రచురణార్థం

ధాన్యం కొనుగోళ్లను అవగాహనతో చేపట్టాలి…

మహబూబాబాద్ నవంబర్ 9.

ధాన్యం కొనుగోళ్లను అవగాహనతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఐకేపీ ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రధానమన్నారు.

రైతు ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకురాగానే రైతు వివరాలు నమోదు చేయాలన్నారు.

ముందుగా తేమశాతం 17 ఉంటే రసీదు కట్ చేయాలని అదే రోజు కొనుగోలు జరపాలన్నారు.

తేమశాతం కొనుగోలుకు అనుకూలంగా వచ్చే వరకు ప్రతిరోజు పరిశీలిస్తూ రిజిస్టర్లో నమోదు చేయాలని అదేవిధంగా శాంపిల్ ను భద్రపరచాలన్నారు.

రవాణాలో లోపాలను అధిగమించేందుకు మారుమూల ప్రాంతాలలో 25 కిలోమీటర్ల లోపు ట్రాక్టర్లు వినియోగించాలన్నారు.

కొనుగోలు కేంద్రాలలో 30 టార్పాలిన్ ఏర్పాటు చేయాలని ప్రతి వెయ్యి మెట్రిక్ టన్నులకు గాను 10 టార్పాలిన్ లు పెంచుకుంటూ కొనుగోళ్లను చేపట్టాలన్నారు. రైతులకు అవసరమైతే నామమాత్రపు రుసుముతో టార్పాలిన్లు అద్దెకి ఇవ్వవచ్చు అన్నారు.

ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లనే వినియోగించాలని, మాయిశ్చర్ మీటర్స్ కూడా ప్రతి కొనుగోలు కేంద్రానికి రెండు ఏర్పాటు చేసుకోవాలన్నారు ప్యాడి క్లీనర్స్ తప్పనిసరిగా ఉండాలని, టెంట్ హౌస్ నుంచి ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ధాన్యము రకాన్ని బట్టి గ్రేడును నిర్ణయించుకొని కొనుగోలు చేపట్టాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, డి పి ఎం నళిని నారాయణ ఏ పీ ఎం లు పాల్గొన్నారు.
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post