ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి…

ప్రచురణార్థం

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి…

తొర్రూరు
మహబూబాబాద్, నవంబర్ 18.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం తొర్రూరు మండలంలోని అమ్మపురం గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి రైతులతోను, అధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత వరకు ధాన్యాన్ని వెంటనే తరలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తెచ్చి విక్రయించు కోవాలన్నారు.

జిల్లాలో గత వరి పంట ఒక లక్ష ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు దిగుబడినివ్వగా, ప్రస్తుతం రెండింతలుగా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని అన్నారు.

కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్లు ఏర్పాటు చేస్తామన్నారు. బస్తా 40 కేజీలతో కలిపి 650 గ్రాములు తూకంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుందని రైతులకు కలెక్టర్ వివరించారు.

అంతకుముందు తొర్రూరు మండలం హరిపిరాలలో 45 ఎకరాల్లో 3 షేడ్ నెట్ లతో ఏర్పాటు చేసిన నర్సరీలలో 4,50,000 ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఆదేశాలను సారముగా హరిపిరాలలో నర్సరీ ఏర్పాటుకు 45 ఎకరాలు, గోపాలగిరిలో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు 75 ఎకరాలు కేటాయించడంలో అధికారులు చూపిన ప్రతిభను ప్రజాప్రతినిధులు
కొనియాడారు.

కలెక్టర్ వెంట ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ తాసిల్దార్ రాఘవరెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ మహేందర్ డి పి ఎన్ నలినిఆయిల్ ఫెడ్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా కోఆర్డినేటర్ సురేష్ నర్సరీ అధికారి హరీష్ ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post