ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల

ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల

వరి పండించే రాష్ట్రాల్లో బీజేపీ లేదనే అక్కసుతో రైతులపై కేంద్రం కక్ష్య సాధింపు

రా రైసే తీసుకుంటామని మొండికేసీనా 3000 కోట్ల పై చీలుకు నష్టాన్ని భరించి ధాన్యం కొంటున్న కేసీఆర్

ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను ఆపేలా కేంద్రం కుట్ర

సౌకర్యాలు లేవని, గన్నీలు బ్యాగ్స్ లేవని అసంబద్ద ఆరోపణలు

రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

00000

     ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు నిరాధారమని తెలియజేసి దానిపై శ్వేతపత్రం విడుదల చేసారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

     కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం లోని ఎలగందల్,చింతకుంట,కరీం నగర్ రూరల్ మండలం లోని దుర్షె్డ్, మగ్దూంపూర్, చర్లబుత్కూర్,చామనపల్లి నగునూరు గ్రామాల్లో డీసీఎంఎస్ ఐకేపీ పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రాన్ని విడుదల చేసారు.మంగళవారం సాయంత్రం వరకూ జరిపిన కోనుగోళ్ల వివరాలు, అందుబాటులో గన్ని బ్యాగులు వంటి వివరాల్ని వెల్లడించారు, కొనుగోళ్ల మొదలు పెట్టిన రోజే బహిరంగంగా ఎన్ని గన్నీ బ్యాగులున్నాయన్నాయో చెప్పామన్నరు. నేడు కేంద్రం నుండి ఒక్క బ్యాగు రాకున్నా… 7కోట్ల 77 లక్షల గన్నీబ్యాగ్ లను రికార్డు స్థాయిలో సేకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3525 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 4.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55,553 మంది రైతుల దగ్గరినుండి సేకరించామన్నారు, ఈ ధాన్యం విలువ 821 కోట్లు రూపాయలని అన్నారు. ఈ డబ్బుల్ని రైతులకు సకాలంలో అందజేయాలంటే మిల్లర్లు గుర్తించాల్సి ఉంటుందని, ఎఫ్.సి.ఐ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ పేరుతో మిల్లర్లు ధాన్యం దించకుండా అడ్డుకుంటున్నారని తద్వారా రైతులకు సకాలంలో ధాన్యం సేకరణ, డబ్బుల విడుదల చేయకుండా కుట్రపన్నారన్నారు. 2019లో కేంద్రం ఎఫ్ .సి.ఐ తో ఎంఓయూ చేసినప్పుడు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎలా సేకరిస్తుందో అలా సహకరిస్తామని చెప్పామని, కానీ ఇష్టానుసారం రైతులకు ఇబ్బందులు సృష్టించే విధంగా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించడం సరికాదన్నారు, అసలు ఒక్క రూపాయి కూడా వడ్లు సేకరించేందుకు కేంద్రం ఇవ్వనప్పుడు, ఆ వడ్లు కేంద్రానివి ఎలా అవుతాయని ప్రశ్నించారు, 2900 మంది మిల్లర్లలో ఒకరిద్దరు మిల్లర్లు అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలతో రైతులను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు, ఆ వడ్లకు ఒక్క రూపాయి ఇవ్వనప్పుడు దాడి చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఆ డబ్బులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివని అందులో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించబోమని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ఆదేశాలు ఇచ్చారని ఆ ఆదేశాల ప్రకారం అక్రమాలు చేసిన ఒకరిద్దరిపై క్రిమినల్ కేసులతో పాటు పూర్తి సొమ్ము రికవరీ పకడ్బందీగా ముక్కుపిండి వసూలు చేస్తామన్నారు. ఎఫ్ సి ఐ ఈ సమయంలో పూర్తిగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను నిలిపేసి తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలో బాగమే ఈ పిజికల్ వెరిఫికేషన్ చర్యలని మంత్రి అన్నారు.
ధాన్యం మిల్లులో ఉందో లేదో అని చేసే ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల ధాన్యం కొనుగోళ్లకు ఎలా అంతరాయం ఏర్పడుతుందో సవివరంగా మంత్రి వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు రైస్ మిల్లులో ఉండే హమాలీ మొదలు గుమాస్తా, అకౌంటెంట్ వరకూ అక్కడే ఉంటారని ఇది జరిగే వరకూ ఎన్ని రోజులైతే అన్ని రోజులు రైస్ మిల్లులో వేరే పనులు నిర్వహించకుండా మిల్లును మూసేస్తారని, మరి కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన రైతుల ధాన్యం మిల్లర్లు దించుకోకపోతే ఇబ్బందులు పడే రైతులకు ఏం సమాదానం చెపుతారన్నారు. అందుకే కొనుగోళ్లు ఊపందుకున్న సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని ఎఫ్ సి ఐ కి చెప్పామని, అసలు కొనుగోళ్లు ఇప్పుడే మొదలైతే ధాన్యం ఉందో లేదో ఇప్పుడే ఎలా చూస్తారని, మొత్తం కొనుగోల్ల ప్రక్రియ ముగిసాక అన్ని వివరాలతో పూర్తి స్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయడానకి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఇందుకోసం జూలై మాసంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేద్దామని లెటర్లు రాసినా పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు.
అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో రైతుల ధాన్యం కొనకపోవడం వల్ల తడిస్తే బాధ్యత తీసుకుంటారా అని మంత్రి ప్రశ్నించారు, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా ముగిసేవిదంగా యుద్ద ప్రతిపాధికన కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రమాణాల మేరకు ఉన్న ధాన్యాన్ని కొని మిల్లులకు పంపి కిలో తరుగు లేకుండా మేం చూసుకుంటున్నామని, కానీ కేంద్రం ప్రస్థుతం ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో సృష్టిస్తున్న ఇబ్బందుల్ని ఇకనైనా ఆపాలని మంత్రి డిమాండ్ చేసారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరి పండక పోవడం, ధాన్యం పండించే రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో లేకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు సృష్టిస్తోందని అన్నారు

     ఈ కార్యక్రమంలో కే డి సి సి చైర్మన్ కొండూరి రవీందర్రావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, జెడ్పీటీసీలు ఎంపీపీలు,సర్పంచులు, స్థానిక నేతలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post