ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. ట్యాబ్ లో ధాన్యంనమోదు వివరాలు సరిగా చేయాలి. అన్ని కేంద్రాలలో కరోనా నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు:::: జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాలలో రైతులు   నాణ్యమైన ధాన్యం తెచ్చి  ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.  ఆదివారం చివ్వేంల మండలం దూరాజుపల్లి లోని   ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోల్లు పారదర్శకంగా జరగాలని, జిల్లాలో 293 కేంద్రాల ద్వారా  రైతుల నుండి ఇప్పటి వరకు    ఒక లక్ష పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు  చేశామని అన్నారు.  వ్యవసాయ, పౌరసరఫరాలు , సహకార శాఖలు రైతులకు అందుబాటులో ఉండి నాణ్యమైన ధాన్యం తో పాటు  తేమశాతం తక్కువగా ఉండేలా  రైతులకు వివరిస్తూ సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో ధాన్యం కొనుగోలు   వేగం పెంచాలని అలాగే కొనుగోలు చేసిన ధాన్యం ఆయా మిల్లర్ల కు సత్వరమే పంపాలని సూచించారు. కేంద్రాలలో నియమించిన సిబ్బంది ట్యాబ్ ఎంట్రి వివరాలు సరిగా చేయాలని రైతుల ఖాతాలలో వెంటనే డబ్బులు జమ అయ్యే విదంగా చూడాలని సూచించారు. జిల్లాలోని అన్ని కేంద్రాలలో  కరోన నిబంధనలు తప్పక పాటించాలని , క్రయ విక్రయాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బంది పై చర్యలు తప్పవని ఈ సందర్బంగా కలెక్టర్  సిబ్బందిని హెచ్చరించారు.
     ఈ కార్యక్రమంలో ఐకేపీ, pacs సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post