ధాన్యం కొనుగోళ్లలో సజావుగా నిర్వహించేందుకు మిల్లర్లు సహకరించాలి…

ధాన్యం కొనుగోళ్లలో సజావుగా నిర్వహించేందుకు మిల్లర్లు సహకరించాలి…

ప్రచురణార్థం

ధాన్యం కొనుగోళ్లలో సజావుగా నిర్వహించేందుకు మిల్లర్లు సహకరించాలి…

మహబూబాబాద్ నవంబర్ 12.

ధాన్యం కొనుగోళ్ల ను సజావుగా నిర్వహించుటలో ధాన్యం దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు జాప్యం చేయరాదని సమస్యలుంటే పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్స్, లారీ అసోసియేషన్ లతో సమీక్షించారు.

జిల్లాలో 11 పార్ బాయిల్డ్ రైస్ మిల్స్ ఉన్నాయని 31 రా రైస్ మిల్ లు ఉన్నాయన్నారు.

గార్ల, కేసముద్రం, దంతాలపల్లి మండలాలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించ చేస్తామన్నారు.

గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా చూస్తామన్నారు కొనుగోలు కేంద్రాల్లో సిబ్బందికి ధాన్యం కొనుగోళ్లలో శిక్షణ ఇచ్చామని తేమశాతం ప్రకారమే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నందున రైతులను ఇబ్బందులకు గురి చేయరాదన్నారు రవాణాలో ఇబ్బందులు తొలగించేందుకు ట్రాక్టర్లను కూడా వినియోగిస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య, పౌరసరఫరాల అధికారి నరసింగరావు, జి.ఎం. సివిల్ సప్లైస్ మహేందర్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ అంబరీష్ తదితరులు పాల్గొన్నారు
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post