ధాన్యం కొనుగోళ్లు పటిష్టంగా నిర్వహిస్తున్నాం…

ప్రచురణార్ధం

ధాన్యం కొనుగోళ్లు పటిష్టంగా నిర్వహిస్తున్నాం…

మహబూబాబాద్, నవంబర్,27.

జిల్లాలో ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక ఉన్నతాధికారులకు నివేదించారు.

శనివారం ధాన్యం కొనుగోళ్లు పై హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కు 230 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

నాణ్యత కొరకు ప్యాడి క్లినర్లు ,మాయిచ్చర్ మీటర్ లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో 30 టార్పాలిన్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 33 లక్షల గన్ని బ్యాగులు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచామన్నారు.

17 తేమ శాతం ఉన్న ధాన్యానికి టోకెన్ లు జారీ చేసి తక్షణం కొనుగోలు చేయడమే గాక ప్రతి కొనుగోలు ట్యాబ్ లో నమోదు చేస్తూ రవాణా చేస్తున్నామన్నారు.

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కలెక్టర్ లను ఆదేశిస్తూ భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) ధాన్యం కొనుగోలు చేయక పోవడం వలన తెలంగాణ లో పండే ధాన్యం పారబాయిల్డ్ కొరకు మాత్రమే వినియోగిస్తున్నందున వరి పంట వేయరాదని రైతులకు రైతు వేదికల ద్వారా అవగాహన పరచాలన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందజేస్తున్నామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏ.ఎస్.పి.యోగేష్ గౌతమ్, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, వ్యవసాయ శాఖాధికారి చత్రు నాయక్ సివిల్ సప్లైస్ డి.ఎం. మహేందర్ పౌరసరఫరాల అధికారి నర్సింగరావు సహకార శాఖ అధికారి ఖుర్షీద్, మార్కెటింగ్ అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
—————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post