ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్* # *కట్టంగూర్, నకిరేకల్,తిప్పర్తి మండలం లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్*

కట్టంగూర్, నకిరేకల్,తిప్పర్తి, నవంబర్ 9.వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కొనుగోలు కేంద్రాల ఇంచార్జి లను ఆదేశించారు.మంగళవారం అదనపు కలెక్టర్ కట్టంగూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన పి.ఏ.సి.ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం,కట్టంగూర్ మండలం అయిటి పాముల గ్రామంలో ఐ. కె.పి కేంద్రం,నకిరేకల్ మండలం లో మార్కెట్ యార్డ్ లో మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, నకిరేకల్ మండలం చీమల గడ్డ,గోరంకల పల్లి లలో ఏర్పాటు చేసిన పి.ఏ.సి.ఎస్.వరి ధాన్యం కొనుగోలు కేంద్రం,తిప్పర్తి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన పి.ఏ.సి.ఎస్.కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి కొనుగోళ్ల ను పరిశీలించారు. నకిరేకల్,నల్గొండ నియోజక వర్గంలో 70 శాతం పంట కోతలు పూర్తి అయి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలను ,కొనుగోళ్ల తీరును సంబంధిత శాఖల ఉన్నతాధికారులు  పర్యవేక్షణ చేయాలని,సమస్యలుంటే సమన్వయం తో పరిష్కరించు కోవాలని ఆదేశించారు.నకిరేకల్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం లో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏ.ఈ. ఓ) ప్రతి రోజు అందుబాటు లో ఉండాలని,ధాన్యం రాశులు ఎక్కువగా ఉన్నందున తేమ శాతం పరిశీలించి  నిర్ణీత తేమ శాతం ఉన్న ధాన్యం తూకం వేసి మిల్లుకు రవాణా చేయాలని కోరారు. నకిరేకల్ మండలం లో ఏ.ఈ. ఓ.ఇంచార్జి గా ఉన్న ఇతర సెంటర్ లకు వేరే వారిని నియమించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.తిప్పర్తి కొనుగోలు కేంద్రం లో లారీ లు ఏర్పాటు చేసి ధాన్యం మిల్లుకు రవాణా చేయాలని అన్నారు.కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని,వర్షాలు పడితే జాగ్రత్తగా ధాన్యం తడవ కుండా టార్పాలిన్ లు కప్పేందుకు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్,మండల తహశీల్దార్ లు,పౌర సరఫరాల డి.టి.లు ఉన్నారు

Share This Post