ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిపేందుకు పర్యవేక్షణ చేపట్టాలి.

ప్రచురణార్ధం

ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిపేందుకు పర్యవేక్షణ చేపట్టాలి.

మహబూబాబాద్, నవంబర్,10.

ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు తహసీల్దార్ లు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లు, ఓటర్ల జాబితా రూపకల్పన, ఎమ్మెల్సీ ఎన్నికలు , ధరణి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో గతంలో 1.26 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేస్తే అందుకు రెండింతలుగా 2.50 లక్షల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నదని తెలియజేసారు. రైతు ధాన్యంను వ్యవసాయ విస్తరణ అధికారులు ముందుగా పరిశీలించి టోకెన్ మంజూరు చేస్తారని, కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తేగానే, కొనుగోలు ప్రత్యేక అధికారి వి.ఆర్.ఓ. రైతు వివరాలను కొనుగోలు కేంద్రంలో ట్యాబ్ లో నమోదు చేయించాలన్నారు.

రైతు ధాన్యం అరబెట్టుకునే వసతి లేనివారికి అరబెట్టుకునే విధంగా, రవాణాకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాలలో నైనా, విశాలంగా ఉన్న ప్రదేశాలలో నైనా ఏర్పాటు చేసేందుకు మండలస్థాయి అధికారులు పర్యటించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

తేమ శాతం 17 ఉంటె రిసీట్ వెంటనే కట్ చేయాలన్నారు. అదేరోజు కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు.

కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

జిల్లాలో గన్ని బ్యాగ్స్ 33 లక్షలున్నాయన్నారు. అంతేగాకుండా మరో 20 లక్షల గన్ని బ్యాగులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.

రవాణా సమస్యలు అధిగమిస్తూ ధాన్యం కొనుగోళ్ళను సజావుగా నిర్వహించాలన్నారు.

ఓటరు జాబితా ను మరొకసారి పరిశీలించి కోవిడ్ తో మృతి చెందినవారిని గుర్తించి తొలగించాలన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధన పాటిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ధరణి ఆన్లైన్ నమోదు ప్రక్రియకు కృషి చేస్తున్న అధికారులను కలెక్టర్ ప్రశంసించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, తొర్రుర్ ఆర్డీఓ రమేష్, జిల్లా అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.
——————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post