*ధాన్యం కొనుగోళ్ళలో వేగం పెంచాలి :: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్

*ధాన్యం కొనుగోళ్ళలో వేగం పెంచాలి :: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, నవంబర్, 24: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచి, ఎక్కువ మొత్తంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట, కొత్తపెల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోళ్ళు కేంద్రాల్లో తప్పనిసరిగా తూకపు మిషన్లు, తేమ యంత్రాలు, గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ధాన్యం విక్రయించిన తర్వాత రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సేకరించిన ధాన్యం మిల్లులకు తరలించడంలో ఆలస్యం చేయవద్దని ఆయన తెలిపారు. అనంతరం ఆయన తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి రైస్ మిల్లును సందర్శించారు. మిల్లులకు లారీల్లో వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. రైస్ మిల్లులకు పవర్ కట్ సమస్యలు ఉండకుండా విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీఆర్డీఓ కె. కౌటిల్య, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, తదితరులు వున్నారు.

Share This Post