ధాన్యం కొనుగోళ్ళు ,లోడింగ్ ,అన్ లోడింగ్ వేగంగా జరిగేలా చూడాలి : టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి

-అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి
-క్లస్టర్ ఇంచార్జీలు ప్రతి కేంద్రం ను సందర్శించాలి

-అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియ ను సజావుగా జరిగేలా చూడాలి

-తూకం వేసిన ధాన్యం ను వెంటనే రైస్ మిల్ లకు తరలించాలి

-వచ్చే 3 రోజుల్లో కేంద్రాల లో ధాన్యం స్టాక్ జీరో చేయాలి
-క్లస్టర్ ఇంచార్జీ లే ధాన్యం సేకరణ కు బాధ్యత వహించాలి

– ముందస్తు కార్యాచరణ స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా ,వేగంగా ధాన్యం కొనుగోళ్ళు జరిగేలా చూడాలి

-టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి

దీపావళి పండుగ తర్వాత నుంచి సిద్దిపేట జిల్లాలో వరికోతలు ఊపందుకున్న దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ళు ,లోడింగ్ ,అన్ లోడింగ్ వేగంగా జరిగేలా చూడాలి జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం వానాకాలం వడ్ల పంట ప్రోక్యూర్ మెంట్ పై రెవెన్యూ డివిజన్ అధికారులు , నియోజకవర్గ బాధ్యులు, క్లస్టర్ ఇంచార్జీ లైన మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్ లు,MPDO లు, MAO లు వచ్చే 5 రోజులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం ను వెంటనే తూకం వేసేలా వేయడం, తూకం వేసిన ధాన్యం తరలించడం, ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ, రైతులకు వెంటనే పే మెంట్ లు జరిగేలా చూడడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

సోమవారం IDOC నుండి ధాన్యం కొనుగోళ్ళ పై జిల్లా రెవెన్యూ అధికారి , RDO లు, క్లస్టర్ ఇంచార్జీ లైన మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్ లు,MPDO లు, MAO లు, మెప్మా , జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ , మార్కెటింగ్ , సహకార శాఖ , పౌర సరఫరాల శాఖ అధికారులు , సిబ్బంది తో జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు రైతుల నుంచి అధిక ధాన్యం వచ్చిందన్నారు . రానున్న మూడు రోజుల్లో కోతలు వేగంగా జరిగి మరింత ధాన్యం కేంద్రాల వద్దకు వస్తుందన్నారు . ముందస్తు కార్యాచరణ తో ధాన్యం కొనుగోళ్ళు , లోడింగ్ , అన్ లోడింగ్ వేగంగా జరిగేలా చూడకుంటే ధాన్యం సేకరణ లో అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందన్నారు. క్లస్టర్ ఇంచార్జీలుగా ఉన్న మండల ప్రత్యేక అధికారులు , తహసిల్దార్ లు , mpdo లు , మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని మండలం , క్లస్టర్ పరిధిలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సదర్శించాలని అన్నారు . కేంద్రంలోని స్టాక్ , ట్రాన్స్పోర్ట్ విధానం , రవాణా , గన్ని బ్యాగు ఉన్నాయా లేదా అని విషయాలను పరిశీలించాలని అన్నారు . కొరత ఉంటే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తెప్పించుకోవాలని అన్నారు . ఏమైనా సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే పరిష్కారం చూపాలన్నారు. వచ్చే 3 రోజుల్లో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం స్టాక్ పూర్తిగా లేకుండా కొనుగోలు చేయలన్నారు . క్లస్టర్ ఇంచార్జీ అధికారులే తమ క్లస్టర్ పరిధిలో ధాన్యం సేకరణ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు .

ధాన్యం కొనుగోళ్ళు సజావుగా జరిగేలా చూసేందుకు నియోజవర్గ బాధ్యులను నియమించామని అన్నారు . సిద్దిపేట నియోజకవర్గం కు DRO శ్రీ బి చెన్నయ్య , హుస్నాబాద్ కు RDO శ్రీ జయ చందర్ రెడ్డి , గజ్వేల్ కు ఆర్డీఓ శ్రీ జయ చందర్ రెడ్డి , దుబ్బాక కు DRDO శ్రీ గోపాల్ రావు ను నియోజకవర్గ బాధ్యులుగా నియమించామని జిల్లా కలెక్టర్ తెలిపారు . నియోజకవర్గ బాధ్యులు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వారీగా క్లస్టర్ ఇంచార్జీ అధికారులు, కేంద్రం నిర్వాహకులతో సమీక్ష నిర్వహించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైనన్ని తూకపు మిషన్లు, తేమ యంత్రాలు, గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్న ధాన్యం, ఇప్పటికే కేంద్రంలో తూకం వేసిన ఉన్న ధాన్యం వివరాలను తెలుసుకుని అవసరమైన గన్ని బ్యాగ్ ల ను సమకూర్చుకొవాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు .

హమాలీలు, గోనె సంచుల కొరత ఉంటే సమకూర్చుకోవాలని సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు స్థానికంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. రైస్ మిల్ ల వద్ద లోడింగ్ , అన్ లోడింగ్ వేగంగా జరిగేలా చూడాలన్నారు .రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు.
టెలీ కాన్ఫరెన్స్ లో DRO శ్రీ బి చెన్నయ్య, RDO లు శ్రీ జయ చందర్ రెడ్డి , శ్రీ విజయేందర్ రెడ్డి , శ్రీ అనంత రెడ్డి , DRDO శ్రీ గోపాల్ రావు , పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీ హరీష్ తదితరులు పాల్గొన్నారు .
—————————-

Share This Post