ధాన్యం కొనుగోళ్ళు వేగంగా చేపట్టాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు ఆమె బీబీనగర్ మండలం రాఘవాపురం, రుద్రవెల్లి గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు విధానాన్ని  పరిశీలించారు. తేమ, తూకం యంత్రాలను పరిశీలించారు. ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేపట్టాలని,  రైతుల ఖాతాలలో డబ్బులు వెంటనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కొనుగోలు అధికారులను ఆదేశించారు.
అనంతరం కనకదుర్గ రైస్ మిల్ సందర్శించి సందర్శించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా లారీల నుండి ధాన్యం వెంట వెంటనే అన్ లోడ్ అయ్యే విధంగా చూడాలని,  యాసంగి సి.ఎం.ఆర్. మిల్లింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు.
కార్యక్రమాలలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మ రావు, సివిల్ సప్లై డిఎం గోపికృష్ణ,  జిల్లా కో ఆపరేటివ్ పరిమళ, అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్ళు వేగంగా చేపట్టాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

Share This Post