ధాన్యం కోనుగొలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం-1 తేదీ.26.10.2021
ధాన్యం కోనుగొలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల,అక్టొబర్ 26 :- జిల్లాలో తోరలో ప్రారంభం చేయనున్న ధాన్యం కొనుగొలు కేంద్రాలలో

ధాన్యం కోనుగొలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

అవసరమైన అన్ని ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కోనుగోలు అంశం పై మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలంలో 293000 ఎకరాలలో వరి సాగు జరిగిందని, 657177 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 400 ధాన్యం కొనుగొలు కేంద్రాల ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని తెలియచేసారు. ధాన్యం కోనుగోలు చేసే సమయంలో నాణ్యత పై కఠినంగా వ్యవహరించాలని, నాణ్యత ప్రమాణాల అంశం పై వ్యవసాయ విస్తరణ అధికారులు, సెంటర్ ఇంచార్జిలు భాద్యత వహించాలని, రైతు వేదికలో వీరికి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వానాకాలం ధాన్యం కోనుగోలు కోసం జిల్లాలో అవసరమైన టార్ఫాలిన్ కవర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ధాన్యం శుద్ది యంత్రాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని , తూనికలు కొలతల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్యాడీ క్లీనర్లను మేజర్ సెంటర్లకు కేటాయించాలని, అనంతరం ప్రతి ధాన్యం కోనుగోలు కేంద్రం వద్ద తప్పని సరిగా ప్యాడీ క్లీనర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఏ ప్రదేశంలో ముందు పంట కోతలు జరుగుతాయనే సమాచారం సేకరించి టోకెన్ పద్ధతి ద్వారా, ముందస్తుగా ఎక్కడా ధాన్యం కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దాని పై నివేదిక అందించాలని వ్యవసాయ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ తొలగించే అంశం, తాలు నిర్మూలించడానకి ప్యాడీ క్లీనర్ల వినియోగం తదితర అంశాల పై వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు ధాన్యం కోత అనంతరం వాటిని ఆరబెట్టుకొని, 17% లోపు తేమ, 1% లోపు చెత్త తాలు, 1% లోపు మట్టి రాళ్లూ, 5% లోపు పురుగు తిన్న, రంగు మారిన ధాన్యం, 3% ముడచుకు పోయిన ధాన్యం , 6% తక్కువ రకముల మిశ్రమం ఉండే విధంగా తయారు చేసి కోనుగోలు కేంద్రాలకు తీసుకోని రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. రైతులు తీసుకొని వచ్చే గ్రేడ్ ఎ రకం ధాన్యానికి రూ.1960/-, సాధారణ ధాన్యానికి రూ.1940/- క్వింటాళ్లుకు మద్దతు ధర చెల్లించి కోనుగోలు చేయాలని అన్నారు. పెరిగిన మద్దతు ధర పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కోనుగొలుకు అవసరమైన గన్ని బ్యాగులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలని, అదే విధంగా ధాన్యం రవాణా అంశంలో సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎం సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ ను ఆదేశించారు. ఈ ధాన్యం కోనుగోలు విషయంలో ఏమైనా సమస్యలు, ఫిర్యాదుల కై టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-8187 కు ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల సమయంలో సంప్రదించ వచ్చని తెలియచేసారు. జిల్లాలో ఉన్న మిల్లులను కోనుగొలు కేంద్రాలకు మ్యాపింగ్ చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. ధాన్యం కోనుగొలు కేంద్రాలో కనీస మౌలిక వసతులు మూత్రశాలలు, మంచి నీరు, సబ్బులు ఏర్పాటు చేయాలని, కోవిడ్ 19 దృష్ట్యా మాస్కు ధరించడం, సానిటైజర్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కోనుగొలు కేంద్రాలో విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖను కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కోనుగొలు కేంద్రం మరియు రైస్ మిల్లుల వద్ద హమాలీలు అందుబాటులొ ఉండేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో లోడింగ్ అన్ లోడింగ్ ప్రక్రియ జరగాలని అన్నారు.
ఆర్డీ.ఓ జగిత్యాల, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, జిల్లా తూనికల కొలతల అధికారి, డిసిఎంఎస్ మేనేజర్, డి.సి.ఓ., ఏఫ్.సి.ఐ అధికారులు, రైస్ మిల్లు ప్రతినిధులు, లారీ ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post