ధాన్యం కోనుగొలు సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు::జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం —-1

తేదీ.25.4.2022

ధాన్యం కోనుగొలు సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు::జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల , ఏప్రిల్ 25:- జిల్లాలో ధాన్యం కోనుగొలు చేసే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ జి. రవి తెలిపారు. ధాన్యం కోనుగొలు ప్రక్రియ పై ఫిర్యాదులు స్వికరించే దిశగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు.

యాసంగి లో రైతులు సాగు చేసిన నాణ్యమైన వరి పంటను పూర్తి స్థాయిలో కొనుగొలు చేసే దిశగా ప్రతి గ్రామంలో ధాన్యం కోనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో రబీ పంట కింద 4.8లక్షల ఎకరాల్లో 1020కోట్ల విలువ గల 5.2లక్షల మెట్రిక్ టన్నుల వరి కోనుగోలు అంచనాతో జిల్లా లో 421 ధాన్యం కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 327 ధాన్యం కొనుగొలు కేంద్రాలు ప్రారంభించామని, మిగిలినవి అవసరమేరకు గ్రామాల్లో త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.

ప్రణాళికాబద్దంగా ధాన్యం కొనుగొలు ప్రక్రియ జరగాలని, దీని కోసం క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగొలు కేంద్రాలో నేరుగా రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కోనుగొలు చేస్తామని, దళారుల నుంచి చేయమని స్పష్టం చేసారు.

రైతులకు ధాన్యం నాణ్యత ప్రమాణాల పై అధికారులు అవగాహన కల్పిస్తున్నారని, రైతులు సదరు నాణ్యత ప్రమాణాలు పాటిస్తు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగొలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేసారు.

ధాన్యం కొనుగొలు ప్రక్రియలో కలిగే ఇబ్బందుల పరిష్కారానికి కాల్ సెంటర్ ప్రారంభించామని, రైతులు తమ సమస్యలను టోల్ ఫ్రీ నెం.18004258187 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దాన్యం కొనుగోలు ప్రక్రియ, రవాణా వంటి అంశాల్లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.

రైతులు ఈ కాల్ సెంటర్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి , జిల్లా పౌర సరఫరాల అధికారి, డి.ఎం. సివిల్ సప్ప్లై, డి.సి.ఓ. ఇతర సంబంధించిన అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాలచే జారీ చేయనైనది

ప్రచురణార్థం ----1 తేదీ.25.4.2022 ధాన్యం కోనుగొలు సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు::జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల , ఏప్రిల్ 25:- జిల్లాలో ధాన్యం కోనుగొలు చేసే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ జి. రవి తెలిపారు. ధాన్యం కోనుగొలు ప్రక్రియ పై ఫిర్యాదులు స్వికరించే దిశగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు.   యాసంగి లో రైతులు సాగు చేసిన నాణ్యమైన వరి పంటను పూర్తి స్థాయిలో కొనుగొలు చేసే దిశగా ప్రతి గ్రామంలో ధాన్యం కోనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో రబీ పంట కింద 4.8లక్షల ఎకరాల్లో 1020కోట్ల విలువ గల 5.2లక్షల మెట్రిక్ టన్నుల వరి కోనుగోలు అంచనాతో జిల్లా లో 421 ధాన్యం కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా  ఇప్పటి వరకు 327 ధాన్యం కొనుగొలు కేంద్రాలు ప్రారంభించామని, మిగిలినవి అవసరమేరకు గ్రామాల్లో త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.   ప్రణాళికాబద్దంగా ధాన్యం కొనుగొలు ప్రక్రియ జరగాలని, దీని కోసం క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగొలు కేంద్రాలో నేరుగా రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కోనుగొలు చేస్తామని, దళారుల నుంచి చేయమని స్పష్టం చేసారు.  రైతులకు ధాన్యం నాణ్యత ప్రమాణాల పై అధికారులు అవగాహన కల్పిస్తున్నారని,   రైతులు సదరు నాణ్యత ప్రమాణాలు పాటిస్తు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగొలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేసారు.  ధాన్యం కొనుగొలు ప్రక్రియలో కలిగే ఇబ్బందుల పరిష్కారానికి కాల్ సెంటర్ ప్రారంభించామని, రైతులు తమ సమస్యలను టోల్ ఫ్రీ నెం.18004258187 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దాన్యం కొనుగోలు ప్రక్రియ, రవాణా వంటి అంశాల్లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.  రైతులు ఈ కాల్ సెంటర్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి , జిల్లా పౌర సరఫరాల అధికారి, డి.ఎం. సివిల్ సప్ప్లై, డి.సి.ఓ. ఇతర సంబంధించిన అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి  జగిత్యాలచే జారీ చేయనైనది
ధాన్యం కోనుగొలు సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు::జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post