ధాన్యం తరలింపులో రవాణాను మెరుగుపరచాలి…

ప్రచురణార్ధం

ధాన్యం తరలింపులో రవాణాను మెరుగుపరచాలి…

మహబూబాబాద్, డిసెంబర్,22.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణం తరలించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ భూములు స్థలాలుగా మార్చి అనుమతి లేకుండా చేపట్టే అక్రమ నిర్మాణాలు, కోవిడ్ లో మృతి చెందిన వారి వివరాలు, ధరణి రిజిస్ట్రేషన్ లు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ల పై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉదయం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మధ్యహన్నాం 3 గంటల వరకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.

వ్యవసాయ భూములు అనుమతి లేకుండా వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ భూములు కాపాడేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థలాల అవసరాలను బట్టి బయో ఫెన్సింగ్ బోర్డు వంటివి ఏర్పాటు చేయించాలన్నారు.

కోవిద్ లో మృతి చెందిన వారి samagra వివరాలు అందజేయాలన్నారు.

ధరణి రిజిస్ట్రేషన్ లు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమురయ్య ఆర్డిఓ రమేష్ డిఆర్డిఎ పిడి సన్యాసయ్య పౌరసరఫరాల అధికారి సి.నరసింగరావు dm civil supplies మహేందర్ తాసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు
——————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post