ధాన్యం నాణ్యత విషయంలో రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండి, దాన్యం లో తేమ శాతం పరిశీలించిన తరవాతే ధాన్యం సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

శుక్రవారం నాడు శాయంపేట
మండలం శాయంపేట, పత్తీపాక గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సత్వరమే ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వరి లో తేమ శాతం ఎక్కువగా ఉండకూడదని, ఈ విషయంలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని , ఆన్లైన్ లో క్రాప్ బుకింగ్ చేసేటపుడు రైతు మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓ.టి.పి చెక్ చేయాలనీ అన్నారు. ధాన్యం లో తేమ శాతం 17 శాతం ఉండేలా చూసుకోవాలని, పూర్తిగా ఎండిన ధాన్యానికి టోకెన్ లు జారి చేయాలని, ఆదేశించారు. ధాన్యాన్ని రైస్ మిల్లు లకు తరలించడానికి అవసరం అయిన వాహనాలు సమకూర్చాలని అన్నారు. ఆదివారం కూడా పనులు కొనసాగాలని తెలిపారు. ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చిన రైతులతో తో మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత పంటకు ఎంత ధాన్యం వచ్చిందని వివరాలను అడిగి తెలుసుకున్నారు. గన్ని బాగుల కొరత లేదని స్పష్టం చేశారు.

అంతకు ముందు శాయంపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వాక్సినేషన్ వివరాలు పై ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారితో పాటు అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్, డి.ఎస్.ఓ వసంత లక్ష్మి, డియం హెచ్ ఓ లలితా దేవీ, డీసీఓ నాగేశ్వరరావు, డియం సివిల్ సప్లయ్ క్రిష్ణ వేణి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post