ధాన్యం పండించిన రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన.

ధాన్యం పండించిన రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన.

వరి కోనుగోలు  కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సాఫీగా కొనుగోలు జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఎస్పీ డా. చేతన తో కలిసి మక్తల్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కొనుగోలు కేంద్రంలో తేమ కొలిచే యంత్రం, వర్షం వస్తే టార్పాలిన్లు, కోవిడ్ ఉన్నందున మాస్క్, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు.  ఒక రైతు తెచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి అందులో తేమ శాతాన్ని పరిశీలించారు.  ఒక వేళ తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆరబెట్టుకోడానికి స్థలం ఉంచాలని అక్కడి సిబ్బందిని సూచించారు.    వరి విక్రయించడానికి వచ్చిన రైతుల వివరాలను తీసుకోవాలని తెలుసుకోవాలన్నారు. రైతులు నష్ట పోకుండా ప్రభుత్వం నిర్దేలించిన ధరలో కొనుగోలు చేయాలన్నారు. మాద్వార్  గ్రామం లో PACS ద్వారా కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని పరిశీలించి పాస్ బుక్ లను పరిశీలించి ధాన్యం  సేకరించాలని సిబ్బందిని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్ల కు తరలించాలన్నారు. అక్కడ విచ్చేసిన రైతులతో మాట్లాడుతూ యాసంగిలో   ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉప్పుడు బియ్యం కొనదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు చూపాలని సూచించారు. యాసంగిలో వాతావరణం మన దగ్గర ఉష్ణోగ్రత శాతం హెచ్చు తగ్గులు ఉండటం వలన బియ్యం విరిగి పోయే ప్రమాదం ఉందని అందువల్ల రైతులు నష్ట పోకుండా వ్యవసాయ   అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  సరిపడా తేమ కొలిచే యంత్రాలు, తల్పాలిన్ లు  అందుబాటులో ఉంచుకోవాలని మార్కెటింగ్ అధికారికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ జిల్లా పౌరసరఫరాల అధికారి శివ ప్రసాద్ రెడ్డి, DM  హతి రామ్, ADA దైవ గ్లోరి మండల వ్యవసాయ అధికారి మిథున్, AEOs మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post