ప్రచురణార్థం
వరి ధాన్యం రవాణ కొరకు కాంట్రాక్టర్ నియామకపు టెండర్లు తీసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ
పెద్దపల్లి, అక్టోబర్ -17:
వరి ధాన్యం రవాణ కొరకు వచ్చిన టెండర్లను అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సోమవారం తెరిచారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజను 2022-23 కొరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు రవాణా చేయుటకు కాంట్రాక్టర్ల నియామకపు టెండర్లు పిలవగా, జిల్లాలోని నాలుగు సెక్టారులకు (పెద్దపల్లి , సుల్తానాబాద్ , మంథని , రామగుండము ) సంబందించి ఆన్లైన్ లో వచ్చిన టెండర్లను అదనపు కలెక్టరు అందరి సమక్షములో తెరిచి, కమీషనరు , పౌర సరఫరాల శాఖా, హైదరాబాదు వారి తుది నిర్ణయం కొరకు సమర్పించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జిల్లా మేనేజర్ తోట వెంకటేశ్, టెండరు కమిటీ, సిబ్బంది పాల్గొన్నారు.
———————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.