రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ఇప్పటివరకు 60 కోట్లు చెల్లించామని రెండు మూడు రోజుల్లో మిగతా చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
మంగళవారం డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఏర్పాటుచేసిన కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో చివరిదశకు వచ్చేసామని నిన్నటి వరకు 5 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడం జరిగిందన్నారు.
మూడు నాలుగు రోజుల్లో 98% కొనుగోలు పూర్తి చేసుకోనున్నట్లు ప్లాన్ చేసుకుంటున్నామన్నారు. నిన్నటి వరకు 60 కోట్ల రూపాయలు రైతులకు పేమెంటు చేయడం జరిగిందన్నారు. మిగతావి రెండు మూడు రోజుల్లో ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వచ్చే సీజన్కు సంబంధించి రైతులకు ఉపయోగపడే లాభసాటి పంటలు రబీ సీజన్లో సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఈ రబీ (యాసంగి) సీజన్లో పండించే పంట తప్పకుండా లాభసాటి పంటలు మార్కెట్ లో డిమాండ్ వున్న పంటలు వేయాలని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చిన విధంగానే రైతుబంధు, విద్యుత్, సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్తు,. వ్యవసాయ,. ఇరిగేషన్., హార్టికల్చర్., మార్క్ఫెడ్ ద్వారా ఎరువులు ఇంతకుముందు ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చిందో అదేవిధంగా రబీ సీజన్లో కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రబీలో సాగు చేసే పంటలు రైతులకు లాభం చేకూర్చే విధంగా . వ్యవసాయ విస్తరణ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని, రైతులు నష్టపోకుండా పండించిన పంట ద్వారా లాభం పొందే పంటలు ఎంచుకోవాలని అన్నారు.
ఈ సీజన్లో మొదట తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేశారని కానీ ఆరు లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన పోతున్నామని, మిగతా ధాన్యం చాలా వరకు బోధన్ బాన్సువాడ ఏరియా లో ప్రైవేటు ట్రేడర్స్ కొనడం జరిగిందని అన్నారు.
రబీ సీజన్లో ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఉండవు
కాబట్టి డిమాండ్ ఉన్న మిల్లర్ తోఅగ్రిమెంట్ చేసుకొని పండించుకోవచ్చని, ఎలాంటి అభ్యంతరం లేదని, మార్కెట్ లో జైశ్రీరామ్, హెచ్ఎంటి, గంగా కావేరి రకాలకు డిమాండ్ వున్నదని అన్నారు. రైతు సోదరులు గమనించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస రావు, పిఎసిఎస్ సెంటర్ చైర్మన్ గజవాడ జయపాల్, తదితరులు పాల్గొన్నారు.