ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, డిసంబర్ 1: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఇప్పటి వరకు ఎందరు రైతుల నుండి, ఎంత ధాన్యం కొనుగోలు చేసింది, మిల్లులకి ఎంత రవాణా చేసింది, ఎంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు సరిపడా ఉన్నవి, తూకం, తేమ పరీక్ష యంత్రాల పరిస్థితిని తెలుసుకున్నారు. రైతుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ట్రక్ షీట్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేయాలని, ధాన్య రవాణాపై వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ, ఉప సర్పంచ్ ఎన్. సంధ్య, ఏపీఎం జయసుధ, సీఏ రమ్య అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post