*ధాన్య కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన జిల్లా కలెక్టర్*

*ధాన్య కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన జిల్లా కలెక్టర్*

*ప్రచురణార్థం-3*
*ధాన్య కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన జిల్లా కలెక్టర్*
*రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25: గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్య కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మంజూరుచేసిన 265 ధాన్య కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికి 256 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడగా, 248 కేంద్రాలలో ధాన్య కొనుగోళ్ళు చేపట్టబడ్డాయన్నారు. 15 వేల 615 మంది రైతుల నుండి రూ. 195 కోట్ల 34 లక్షల విలువగల 99 వేల 661 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందులో 91 వేయి 435 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల నుండి గోడౌన్లకు తరలించామన్నారు. 7 వేల 905 మంది రైతుల డాటా ఆన్లైన్ చేసినట్లు, 47 వేల 768 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆన్లైన్ ఫీడింగ్ పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 4 వేల 510 మంది రైతులకు రూ. 48 కోట్ల 56 లక్షలు ధాన్యం డబ్బులు వారి వారి ఖాతాల్లో జమచేసామన్నారు. రైతుల డాటా రిజిస్ట్రేషన్లు, ట్రక్ షీట్ జనరేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ధాన్య కొనుగోలు ఎక్కువగా జరుగుతున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అట్టి కేంద్రాలకు మరిన్ని వాహనాలు పంపే ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రాలు కొనుగోలు చేస్తున్న ధాన్యం, రవాణా అవుతున్న ధాన్యంపై ప్రతి రోజు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఏ కేంద్రంలో సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీసీఓ బుద్ధనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Share This Post